మంచంపై మరణిస్తే ఆ బెడ్ వాడొచ్చా? వాస్తు, సైన్స్ ఏం చెబుతోంది?

Published by: RAMA

ఈ ప్రశ్నకి సమాధానం సంస్కృతి, వ్యక్తిగత , మానసిక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది

మంచంపై మరణం సంభవిస్తే దాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు కొందరు

ఎవరికైనా ఇచ్చేసి కొత్తది కొనుగోలు చేస్తారు ఇంకొందరు

మరణం జరిగిన గది/మంచాన్ని పంచగవ్యం, గంగాజలంతో శుద్ధిచేసి మళ్లీ ఉపయోగిస్తారు మరికొందరు

మరణం వల్ల వచ్చే అపవిత్రత నుంచి ఈ సంప్రదాయం వచ్చింది

దక్షిణ భారతదేశం..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ నమ్మకం బలంగా ఉంటుంది

సైన్స్ దృక్పథం నుంచి చూస్తే ఆ మంచాన్ని తిరిగి వినియోగించడంలో ఎలాంటి సమస్యా లేదని చెబుతారు

అయితే.. ఆ మంచంపై పడుకుంటే మరణించిన వ్యక్తి గుర్తుకు వచ్చి మానసికంగా బాధపడతారు

కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులు ఆ మంచంపై నిద్రపోయేందుకు ఇష్టపడరు

మీకు మానసికంగా సౌకర్యంగా ఉంటే సరే..లేదంటే ఆ మంచాన్ని మార్చేయడమే మంచిదంటారు వాస్తు నిపుణులు