మరణం గురించి భగవద్గీతలో ముఖ్యమైన పాయింట్లు ఇవే
ఆత్మకు చావు పుట్టుక ఉండదు ..ఆత్మ శాశ్వతం
శరీరం మారుతుంది..జీవుడు ఓ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరిస్తాడు
ఎంత గొప్పగా బతికినా, దుర్భరంగా జీవించా ప్రతి జీవికి మరణం సహజం, తప్పనిది తప్పించుకోలేనిది
మానవుడు కొత్త దుస్తులు ధరించినట్టే ఆత్మ కూడా కొత్త శరీరం ధరిస్తుంది..పునర్జన్మ ఉంటుంది
ధీరులు ఎప్పుడూ మరణానికి భయపడరు..జ్ఞానం ఉన్నవారు దీన్నో మార్గంగా చూస్తారు
మరణం మీద శోకం తగదు..ఎందుకంటే ఆత్మకు ఎలాంటి హాని జరగదు
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిన విషయాలివి