ఆషాఢ మాసం 2026: ప్రారంభ తేదీ, ముఖ్య పండుగలు

Published by: RAMA

ఆషాఢమాసం 2026 జూలై 15 బుధవారం నుంచి ఆగష్టు 12 బుధవారం అమావాస్య వరకు

పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడంతో ఈ పేరు వచ్చింది

ఈ నెలలోనే ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం మొదలవుతుంది

శూన్యమాసం కావడంతో శుభకార్యాలు నిర్వహించరు

నవదంపతులు ఈ నెల రోజులు విడిగా ఉంటారు

వర్షాకాలం ప్రారంభమయ్యే కాలం, సహజ పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుంది

శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకునే సమయం..ఇదే తొలి ఏకాదశి

చాతుర్మాస్యం ప్రారంభం, విష్ణుపూజ, ఉపవాసాలకు విశేష సమయం

వేద వ్యాసుడిని స్మరించి పూజించే గురు పౌర్ణమి వచ్చేది ఈ నెలలోనే

ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల ఉత్సవం జరుగుతుంది