చెవులు కుట్టించుకోవడం ఒకప్పుడు సాంప్రదాయంగా ఉన్న ఈ పద్ధతి ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. మహిళలతో పాటూ యువతరం, పురుషులు కూడా చెవులు కుట్టించుకుంటున్నారు
ప్రాచీన భారతదేశం నుండి చెవి కుట్టుకునే ఆచారం ఉంది. ఇది కేవలం అలంకారిక ఆచారం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, జ్యోతిష్య సాంస్కృతిక నమ్మకాల్లో లోతుగా పాతుకుపోయింది.
చెవిపోగులు గుచ్చడం శరీరంలో ముఖ్యమైన శక్తి బిందువులను ఉత్తేజితం చేస్తుందని నమ్ముతారు, ఇది మానసిక ఏకాగ్రతను , భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది.
సాంప్రదాయ నమ్మకాల ప్రకారం చెవి కుట్టుకోవడం వల్ల మానసిక స్పష్టత లభించడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం , సానుకూల శక్తి లభిస్తుంది.
ఈ పురాతన ఆచారానికి ఒక శాస్త్రీయ కోణం ఉందని సూచిస్తున్నారు. శబ్ద గ్రహణశక్తి , మానసిక ప్రశాంతతకు సంబంధించిన మెదడు నరాలను ఉత్తేజితం చేస్తాయని చెబుతారు.
శాస్త్రవేత్తలు ఈ అభ్యాసం అంతర్గత శక్తిని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుందని, శరీరం - మనస్సు మధ్య సామరస్యాన్ని కాపాడుతుందని కూడా నమ్ముతారు.
ఆధ్యాత్మిక సంప్రదాయాలలో చెవి కుట్టుకోవడం 'మూడవ కన్ను'ని ఉత్తేజితం చేస్తుందని భావిస్తారు ఇది అవగాహన, అంతర్ దృష్టిని పెంచుతుందని నమ్మకం
పుష్యమి, రోహిణి, హస్త నక్షత్రాలు చెవి కుట్టు కార్యక్రమాలకు అత్యంత శుభప్రదమైనవిగా పరిగణిస్తారు
గ్రహణ సమయాల్లో లేదా రాహు కాలంలో చెవి కుట్లు చేయించుకోవడం మంచిది కాదు అని నిపుణులు సలహా ఇస్తున్నారు