పౌర్ణమి - అమావాస్యకి చంద్రుడిలో హెచ్చు తగ్గులు ఎందుకు!



ద‌క్షుడు చంద్రుడిని త‌న అల్లుడిగా చేసుకోవాలి అని అనుకుంటాడు. తన 27 మంది కుమార్తెలను చంద్రుడు కి ఇచ్చి పెళ్లి చేస్తాడు



చంద్రుడు త‌న 27 మంది కుమార్తెలును స‌మానంగా చూసుకుంటాడని ద‌క్షుడు భావిస్తాడు..ఈ మేరకు మాట తీసుకుంటాడు కూడా. కానీ చంద్రుడు మాట తప్పుతాడు.



27 మంది భార్య‌లు ఉన్నా రోహిణి అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మిగిలిన వారిని సరిగ్గా పట్టించుకోడు. 26 మంది కుమార్తెలు తండ్రి ద‌క్షుడుకి ఫిర్యాదు చేస్తారు.



చంద్రుడుని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ద‌క్షుడు కోపంతో చంద్రుడికి శాపం ఇస్తాడు. రోజు రోజుకు వెలుగు త‌గ్గిపోతూ అంత‌మ‌వుతావంటూ శపిస్తాడు.



శాప‌విమోచ‌నం కోసం ముల్లోకాల్లో ఉన్న దేవ‌త‌ల వ‌ద్ద‌కు వెళ్తాడు. ద‌క్షుడు బ్ర‌హ్మదేవుడి కుమారుడు కావ‌డంతో చంద్రుడునికి సహాయం చేయలేను అని తిరిగి పంపించేస్తారు.



శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లినా ఫలితం ఉండదు. చివ‌రి ప్ర‌యత్నంగా మహా శివుడు వద్దకు వెళతారు చంద్రుడు.



లోక క‌ళ్యాణార్థం 15 రోజులు పాటు క్షీణించి తిరిగి 15 రోజులు పాటు నీవు వెలుగు నింపుతావు అని మహా శివుడు ఆశీర్వ‌దిస్తాడు.



సంతోషించిన చంద్రుడు భక్తితో తనను తాను స‌మ‌ర్పించుకుంటాడు. అప్పటి నుంచీ చంద్రుడిని సిగలో ధరించి చంద్రశేఖరుడిగా మారాడు శివుడు



అలా పౌర్ణమి - అమావాస్య ఏర్పడ్డాయని చెబుతారు పండితులు..



Images Credit: Freepik