నదీ స్నానం చేస్తున్నారా, అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
తెలిసీ తెలియక చేసిన చాలా పాపాలు దైవభక్తితో నదీస్నానం చేయడం ద్వారా హరించిపోతాయంటారు. అయితే పుష్కరాలు, కార్తీకమాసంలో నదీ స్నానం ఎంత ముఖ్యమో.. సంక్రాంతి వేళ కూడా నదీస్నానం మంచిదంటారు.
నదుల్లో , కాలువల్లో స్నానం చేసేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానమాచరించాలి
ప్రవాహానికి వాలుగా మగవారు స్నానం చేస్తే వారిలో మగతనం నశిస్తుందట. ప్రవాహానికి ఎదురుగా ఆడవారు స్నానం చేస్తే వారిలో స్త్రీత్వం పోతుందని చెబుతారు.
ఓ నదిలో స్నానం చేస్తున్నప్పుడు మరో నదిని దూషించకూడదు
స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురు!!
మాటల ద్వారా చేసే పాపాలు: కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, పొంతన లేని, వినలేని మాటలు మాట్లాడడం.
మానసిక పాపాలు: తనది కాని ధనం, వస్తువుల మీద వ్యామోహం, ఇతరులకు ఇబ్బంది కల్గించే పనులు చేయడం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం
శరీరంతో చేసే పాపాలు: అర్హత లేని వారికి దానం ఇవ్వటం, శాస్త్రం ఒప్పుకోని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషుడికి స్వీకరించడం
నదీ స్నానంతో ఈ మూడురకాల పాపాలు నశిస్తాయని చెబుతారు