సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని చక్కని ముగ్గుతో లక్ష్మీదేవికి స్వాగతం పలకండి
స్నానమాచరించి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని నారాయణుడిని భక్తిశ్రద్ధలతో పూజించండి
ముందుగా వినాయకుడికి దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి..అనంతరం శ్రీ మహావిష్ణువు అష్టోత్తరం కానీ, విష్ణుసహస్ర నామాలు కానీ పఠించండి
వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదివి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి
రోజంతా ఉపవాసం ఉండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి..సాయంత్రం పండ్లు తిని జాగరణ చేయండి
ద్వాదశి రోజు ఉదయం స్నానమాచరించి వంట చేసి భగవంతుడికి నివేదించి.. బ్రాహ్మణుడికి అన్నదానం చేసి ( బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలైనా ఇచ్చి నమస్కారం చేయొచ్చు).. మీ ఉపవాసం విరమించండి.
జనవరి జనవరి 13న ఉపవాసం ఉండాలని భావిస్తే.. ఈ రోజు ( బుధవారం) సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ముందు రోజు నుంచీ నియమాలు పాటించాలి
ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి రోజు ఉదయం భోజనం అయ్యేవరకూ బ్రహ్మచర్యం పాటించాలి.
ఏకాదశి ముందు రోజు నుంచి, ఏకాదశి, ద్వాదశి వరకూ..అంటే మూడు రోజులు నేలపై నిద్రించాలి
ఏకాదశి రోజు రాత్రి సినిమాలు చూస్తూ కూకుండా భగవంతుడి నామస్మరణతో జాగరణ చేయాలి
నిత్యం మీ ఆలోచనా విధానం ఎలా ఉన్నా సరే…ఈ మూడు రోజులు చెడు ఆలోచనలు రానివ్వవద్దు.