మన హీరోల్లో చాలా మందికి సైడ్ బిజినెస్ లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం! మహేష్ బాబు - మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగారు మహేష్. ఆయన ఏఎంబీ థియేటర్ చాలా ఫేమస్. రామ్ చరణ్ - కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు ట్రూజెట్ ఎయిర్ లైన్స్ కంపెనీ ఉంది. అల్లు అర్జున్ - హైదరాబాద్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు అద్వైత వీఎఫ్ఎక్స్ అనే కంపెనీను రన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ - రౌడీ బ్రాండ్ క్లోతింగ్ బిజినెస్ తో పాటు ఏవీడీ అనే థియేటర్ బిజినెస్ మొదలుపెట్టారు. మంచు విష్ణు - స్ప్రింగ్ బోర్డు, న్యూయార్క్ అకాడమీ అనే స్కూల్స్ నడిపిస్తున్నారు. నాని - వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మొదలుపెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. నాగార్జున - అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్నారు. వెంకటేష్ - త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసే బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు.