తమన్నా అందం వెనుక రహస్యం ఇదే అందమైన తమన్నా మచ్చలేని చందమామలా మెరిసిపోతుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా. ఆమె తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది. ఆమె ఉదయం లేచిన వెంటనే కచ్చితంగా మూడు పనులు చేస్తుంది. ఉదయాన పడుకుని లేచిన వెంటనే తనకెంతో ఇష్టమైన పుస్తకాన్ని చదువుతుంది. అందరిలా ఫోన్‌ను చూడదు. శరీరంలోని మలినాలను తొలగించుకునేందుకు ఆయిల్ పుల్లింగ్ చేస్తుంది. ప్రతిరోజు ఉదయం పదినిమిషాల పాటూ ఆ పని చేస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండే ఆల్కలైన్ వాటర్‌ను తక్కువ పరిమాణంలో తీసుకుంటుంది తమన్నా. ఉదయాన ఖాళీ పొట్టతో దాల్చిన చెక్క పొడి కలుపుకుని నిమ్మ నీళ్లు తాగుతుంది. నిద్రపోయి లేచిన వెంటనే ముఖం, కళ్లు వాచినట్టు ఉంటాయి. అందుకు ఐస్ ముక్కలు వేసిన నీళ్ల గిన్నెలో ముఖం ముంచి తీస్తుంది. దీనివల్ల ముఖం తాజాగా మారుతుంది.