కరోనా బారిన పడకూడదంటే... వంటల్లో ఉప్పు తగ్గించాల్సిందే



రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం సంగతేంటి? అందుకే ఉప్పును తగ్గించాల్సిందే.



ఉప్పు మనకు తెలియకుండానే రుచి కోసం అధికంగా తినేస్తున్నాం. దీని వల్ల దీర్ఘకాలంలో అనేక సమస్యలు మొదలవుతాయి.



ఉప్పు తక్కువగా తింటే కరోనా బారిన పడే అవకాశం తగ్గుతుంది, అలాగే కరోనా వైరస్ మీ శరీరంలో చేరినా దాన్ని తట్టుకునే శక్తి శరీరానికి ఉంటుంది.



జర్మనీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం ఉప్పు కలిగిన ఆహారం తీవ్రమైన బాక్టీరియల్ ఇన్షెక్షన్‌కు కారణమవుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.



కరోనా కాలంలో రోగినిరోధక శక్తిని పెంచుకోవాలి కానీ, తగ్గించుకునే పనులు చేయకూడదు. కాబట్టి ఉప్పుని తగ్గించుకోండి.



ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం రోజుకు ఒక మనిషి ఐదు గ్రాముల ఉప్పును తినవచ్చు. ఇది ఒక టీ స్పూన్‌కు సమానం. అంతకుమించి తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.



కూరల్లో తక్కువ నీళ్లు వేసి వండితే తక్కువ ఉప్పుతో సరిపెట్టవచ్చు. నీళ్లు అధికంగా కలిపే కొద్దీ ఉప్పు వేయడం అధికమవుతుంది.