స్పైసీ కొత్తిమీర పచ్చడి రెసిపీ



కొత్తిమీర తరుగు - ఒక కప్పు
పచ్చిమిర్చి - అయిదు
కరివేపాకు - గుప్పెడు
ఎండు మిర్చి - రెండు
జీలకర్ర - అర టీస్పూను

చింతపండు - చిన్న ఉండ
శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
ఆవాలు - ఒక స్పూను
మినపప్పు - ఒక టీ స్పూను

కళాయిలో కాస్త నూనె వేసి ఎండుమిర్చి, శెనగపప్పు, మినపప్పు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే కళాయిలో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు మిక్సీలో వేయించినవన్నీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి తాళింపు వేసుకోవాలి.

టేస్టీ అండ్ స్పైసీ కొత్తిమీర పచ్చడి రెడీ.



వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటే ఆ రుచే వేరు. దోశె, ఇడ్లీతో కూడా బావుంటుంది.