మన కరెన్సీ నోట్లను ఏ పదార్థంతో తయారుచేస్తారంటే...



మన కరెన్సీ నోట్లను చూసి అవి మందపాటి కాగితం అనుకుంటున్నారా? కాదు. ఆ మెటీరియల్ ప్రత్యేకమైనదే.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని ఎక్కువ మన్నికైన మెటిరీయల్ ఉపయోగించి చేస్తుంది.

75 శాతం పత్తి, 25 శాతం నార మిశ్రమాన్ని వాడుతుంది.

ప్రింటింగ్ ప్రక్రియలో పత్తిని జెలటిన్ అనే అతుక్కునే లక్షణం ఉన్న పదార్థంతో మిక్స్ చేస్తారు.

పత్తి, నార, ఇతర పదార్థాలను ఏ నిష్పత్తిలో కలుపుతారన్నది మాత్రం రహస్యంగా ఉంచుతారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 22 ప్రకారం, భారతదేశంలో నోట్లను జారీ చేసే హక్కు రిజర్వ్ బ్యాంక్‌కు మాత్రమే ఉంది.

నాణాలు మాత్రం స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారుచేస్తారు.

వాటి ఆకారం, బరువు విషయంలో నిర్థిష్ట నియమాలు ఉంటాయి.