సాయి పల్లవి ఊహించని వివాదంలో చిక్కుకుంది.

ఓ ఇంటర్వ్యూలో హింస గురించి మాట్లాడుతూ ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తావన తెచ్చింది.

కశ్మీర్ పండిట్ల హత్యలను, గోసంరక్షకులు ముస్లిం వ్యక్తిపై చేసిన దాడితో పోల్చింది.

అవి రెండూ హింసాత్మక ఘటనలేనని చెప్పే ప్రయత్నం చేసింది.

కానీ, హిందూ సంఘాలు ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నాయి.

సాయి పల్లవిపై భజరంగ్ దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘విరాట పర్వం’ సినిమా విడుదల నేపథ్యంలో సాయి పల్లవి సైలెంట్‌గా ఉంది.

ఇలా వివరణ ఇవ్వడం ఇదే ఫస్ట్‌టైమ్ అంటూ.. ఈ వీడియో ద్వారా వివాదంపై స్పందించింది.

డాక్టర్‌గా తనకు ప్రాణం విలువ తెలుసు కాబట్టే అలా మాట్లాడనని తెలిపింది.

మరి సాయి పల్లవి స్పందనతో వివాదం ముగుస్తుందో లేదో చూడాలి.

Images and Video Credit: Sai Pallavi/Instagram