గూగుల్ ట్రాన్సలేషన్‌లో Helpకి అర్థం సోను సూద్ అని వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే సోను సూద్ పేదలకు చేస్తున్న సాయం చరిత్రలో నిలిచిపోతుంది. కరోనా కాలం నుంచి నేటి వరకు సోను సూద్ సాయం చేస్తూనే ఉన్నారు. మున్ముందు కూడా సాయం చేస్తూనే ఉంటానని సోను చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ప్రజలు సాయం కావాలంటే సోనునే అడుగుతున్నారు. సీఎం ఇంటి దగ్గర కూడా కనిపించనంత మంది జనం సోను ఇంటి ముందు కనిపిస్తున్నారు. సోను కేవలం మనుషులకే కాదు, మూగజీవులకు కూడా సాయం చేస్తున్నారు. తాజాగా ముంబయిలో వర్షంలో తడుస్తున్న వీధి కుక్కకు గొడుగు పట్టి సాయం చేశారు. తనకు కొత్త ఫ్రెండ్ దొరికిందని, ముంబయి వర్షాలకు ధన్యవాదాలని సోను తెలిపారు. సోను మంచితనానికి జనాలు ఫిదా అవుతున్నారు. Images and Videos Credit: Sonu Sood/Instagram