కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి 'కేజీఎఫ్' సినిమాతో పాపులర్ అయింది. ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు జనాలు ఆమెని పెద్దగా పట్టించుకోలేదు కానీ సెకండ్ పార్ట్ తో ఆమె ఇమేజ్ కాస్త పెరిగింది. మొదటి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో శ్రీనిధి శెట్టి పాత్రకు స్క్రీన్ స్పేస్ బాగానే ఇచ్చారు. ఆమె పాత్రకు న్యాయం చేసింది. దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటించాలనుకుంటుంది శ్రీనిధి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈమె విక్రమ్ హీరోగా నటిస్తోన్న 'కోబ్రా' అనే సినిమాలో నటిస్తోంది. అలానే తెలుగులో ఓ మిడ్ రేంజ్ హీరో సరసన ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.