రొయ్యల ఇగురు ఇలా చేస్తే సూపర్



రొయ్యలు - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
టమోటా - పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు
మిరియాల పొడి - అర స్పూను
పసుపు - అర స్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను



గరం మసాలా - అర స్పూను
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
జీలకర్ర పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు



ఒక గిన్నెలో రొయ్యలు ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.



స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.



టమోటా తరుగు, ఉప్పు కూడా వేసి బాగా వేయించాలి.



ఈ మిశ్రమం బాగా ఉడికాక మారినేషన్ చేసిన రొయ్యలు వేసి కలపాలి.



ఎనభై శాతం నీరు ఇంకిపోయాక జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, కరివేపాకులు వేసి కలపాలి.



చిన్న మంట మీద ఉడికిస్తే రొయ్యల ఇగురు మంచి టేస్టుగా వస్తుంది.



పైన కొత్తిమీర చల్లితే ఆ టేస్టే వేరు.