నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. లండన్ బేస్డ్ కంపెనీ నథింగ్ లాంచ్ చేసిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఇందులో వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ డిజైన్, ఎల్ఈడీ స్ట్రిప్స్ ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.32,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.38,999గానూ నిర్ణయించారు. జులై 21వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 అదనంగా తగ్గనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 1 పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.