మనిషి అందాన్ని డిసైడ్ చేయాలంటే ముందుగా పరిగణలోకి తీసుకునేది జుట్టే. అయితే జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మానసిక, శారీరక కారణాలతో పాటు.. కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. టోపీ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందని కొందరు నమ్ముతారు. వీటివల్ల నిజంగానే బట్టతల వస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టోపీలు పెట్టుకోవడం జుట్టు రాలిపోదు. ఇది తలపై వేడిని తగ్గిస్తుంది. అయితే బిగుతుగా ఉండే టోపీలు, హెల్మెట్లు పెట్టుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల తలపై చెమట పెరిగి.. బాక్టీరియా వృద్ధి చెంది జుట్టు రాలిపోయే ప్రమాదముంది. (Image Source : Pinterest, Unsplash )