క్రికెటర్ స్మృతి మంధాన 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. జులై 18న కుటుంబ సభ్యుల మధ్య కేక్ కోసి వేడుకలు జరుపుకుంది. హ్యాపీ బర్త్‌డే స్మృతి అంటూ అభిమానులు ఆమెకు విషెస్ చెప్పారు. టీమ్ఇండియాకు దొరికిన అద్భుతమైన ఓపెనర్ స్మృతి వన్డే, టీ20,టెస్టు క్రికెట్లో దూకుడుగా ఆడుతుంది. 87 టీ20ల్లో 2033 రన్స్ కొట్టింది. 74 వన్డేల్లో 2892 రన్స్ చేసింది. ఐసీసీ మహిళల ఛాంపియన్ షిప్ లో 911 రన్స్ కొట్టింది. ఒక సిరీసులో ఎక్కువ సెంచరీలు (2) చేసిన ఆరో క్రికెటర్. కెరీర్లో అతి తక్కువ సార్లు డకౌటైన ఆరో క్రికెటర్.