ABP Desam


జులైలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే!


ABP Desam


జూలై నెలలో పుట్టిన వారు అదృష్టజాతకులు. బాగా సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తారు, పరిశ్రమలు స్తాపిస్తారు. నలుగురి మేలు చేస్తారు. ఇంకా జులైలో పుట్టినవారి లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి


ABP Desam


జూలై నెలలో పుట్టిన వారు చాలా ఆశాజనకంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సానుకూల ధోరణి కలిగిఉంటారు. జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు అన్ని ప్రణాళికలు వేసుకుంటారు, ఆ దిశగా కష్టపడతారు


ABP Desam


జూలైలో పుట్టినవారు ఎంత సున్నితంగా ఉంటారో అంతే స్వీయనియంత్రణ కలిగి ఉంటారు, స్వతంత్రంగా నిర్ణయాత్మకంగా ఉంటారు


ABP Desam


వీరు ఎక్కడుంటే అక్కడ సందడి, సంతోషమే, హాస్యభరితంగా ఉంటారు, మాటల్లో వ్యంగ్యం కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. జీవితంలో చాలా కష్టాలను ఓర్చుకుని నిలబడతారు.


ABP Desam


జూలైలో జన్మించిన వారు ఆసక్తికరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.వీరికి ఆహారం, సంగీతంలో మంచి అభిరుచి ఉంది. వారు జీవితంలోని చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు


ABP Desam


ఈనెలలో పుట్టినవారు తమవల్ల ఎదుటివారికి ఎలాంటి సహాయం అవసరం అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. తెలివితేటలు సరిగ్గా ఉపయోగిస్తే వీరివల్ల కానిదంటూ ఉండదు


ABP Desam


వీరు కొంచెం కలత చెందినా అస్థిరంగా, భావోద్వేగంగా ఉంటారు.సున్నితంగాఉంటారు. ఎవరైనా తమ మనోభావాలను గాయపరిచినప్పుడు వాటిని అధిగమించేందుకు సమయం తీసుకుంటారు.


ABP Desam


మకు అత్యంత ముఖ్యమైన విషయాలు, వ్యక్తులపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తారు. తమ కలలను నెరవేర్చుకునేందుకు కష్టపడి పనిచేస్తారు. కుటుంబ జీవితంపై దృష్టి సారిస్తారు.



అర్థంలేని చర్చలు, చిల్లర నాటకాలు, అర్థంలేని గాసిప్ లను అస్సలు ఆస్వాదించరు. కుటుంబమే సర్వస్వం అన్నట్టుంటారు.



వీరి తెలివితేటలు అమోఘం. మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఏ విషయాన్ని అయినా తొందరగా గ్రహిస్తారు. వీరి మనస్తత్వం ఎవ్వరికీ అర్థంకాదు. పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించరు..తలపెట్టిన పనిపైనే పూర్తిగా ఫోకస్ చేస్తారు.



జూలైలో పుట్టినవారు నమ్మిన దాన్ని నిజాయితీగా చేస్తారు. అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు అమితంగా కష్టపడతారు.
ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు, వాటిని సరిగ్గా అమలుచేసి ఫలితం పొందుతారు.