ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంథన అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రికార్డు సృష్టించారు.

భారత్ తరఫున అత్యంత వేగంగా 3,000 పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా నిలిచారు.

బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ రికార్డు స్మృతి సొంతం అయింది.

కేవలం 76 ఇన్నింగ్స్‌లోనే స్మృతి మంథన 3,000 పరుగులు సాధించారు.

మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ (88 ఇన్నింగ్స్) రికార్డును బద్దలు కొట్టారు.

అంతర్జాతీయంగా చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (62 ఇన్నింగ్స్) మొదటి స్థానంలో ఉన్నారు.

రెండో స్థానంలో ఉన్న మెగ్ లానింగ్ (64 ఇన్నింగ్స్) కూడా ఆస్ట్రేలియా క్రికెటరే.

ఈ మ్యాచ్‌లో స్మృతి మంథన 40 పరుగులు చేసి అవుటయ్యారు.

స్మృతి కెరీర్‌లో ఇప్పటి వరకు 76 మ్యాచ్‌లు ఆడారు.

ఐదు సెంచరీలు, 24 అర్థ సెంచరీలు సాధించారు.
(All Images Credits: BCCI)