పండ్లు తినడం రోజు వారీ అలవాటుగా మార్చుకోవాలి. ఇమ్యూనిటి పెంచుకునేందుకు పండ్లు చాలా అవసరం.

చాలా మంది పండ్లు తినడంలో తప్పులు చేస్తుంటారు. పండ్లు తినేందుకు ఈ నియమాలు తప్పక పాటించాలి.

పండ్లను పెరుగు, చీజ్ వంటి పాలపదార్థాలతో కలిపి తీసుకోవద్దు. ఇది జీర్ణప్రక్రియను అసౌకర్య పరుస్తుంది.

భోజనం తర్వాత వెంటనే పండు తినకూడదు. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో సమయం తీసుకుంటుంది

సూర్యాస్తమయం తర్వాత పండు తినడం మంచిది కాదు. నిద్ర సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ అసౌకర్యంగా మారుతుంది.

అన్ని పండ్లు తొక్కతీసేయొద్దు. కొన్ని తొక్కతో తినడమే మంచిది.

అరటి వంటి తియ్యని పండును ఆరెంజ్ వంటి పుల్లని పండుతో కలిపి తీసుకోవద్దు. అజీర్తికి కారణం కావచ్చు.

ఫైబర్ కలిగి ఉండే పండ్లను పూర్తిగా తినడమే మంచిది. పండ్ల రసాలుగా తీసుకుంటే దాని ఫైబర్ అందదు.

ఓ ఫ్రూట్ ఇష్టమని దానికే స్టిక్ అయిపోవద్దు. ఒక్కోపండుతో ఒక్కో రకమైన పోషణ లభిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels