మర్రి చెట్టు చుట్టూ తెల్లటి నూలుదారం ఎందుకు కడతారో తెలుసా!



జ్యేష్ఠ పౌర్ణమిని వట్ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు వివాహిత స్త్రీలు మర్రి చెట్టును పూజించి 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించమని ప్రత్యేక పూజలు చేస్తారు.



ఈ ఉపవాసాన్ని ఉత్తర భారతదేశంలో వట్ ​​సావిత్రి వ్రతం అంటారు. ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో విష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు.



వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.



ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు.



మర్రిచెట్టు కింద హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది



శనివారం మర్రి కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది



ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు



మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరుపోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి



నోట్: పండితుల నుంచి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.



Images Credit: Pinterest