బీట్‌రూట్ ఇడ్లీ... సింపుల్ రెసిపీ



బీట్‌రూట్‌ను కూరగా తినేందుకు పిల్లలు ఇష్టపడకపోతే ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెడితే తినే అవకాశం ఉంది.



బొంబాయి రవ్వ - రెండు కప్పులు
పెరుగు - ఒక కప్పు
బీట్ రూట్ - మీడియం సైజుది ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడా



స్టవ్ పై కళాయి పెట్టి బొంబాయి రవ్వను కాస్త వేయించాలి.పచ్చి వాసన పోవడానికే ఇలా.

ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, కప్పు పెరుగును బాగా కలపాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.

ఇప్పుడు బీట్‌రూట్ ను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి.

ఇడ్లీ రుబ్బులో బీట్‌రూట్ పేస్టు, ఉప్పు వేసి కలపాలి. పావుగంట సేపు అలా పక్కన వదిలేయాలి.

తరువాత ఇడ్లీ ప్లేట్లకు కాస్త ఆయిల్ రాసి రుబ్బును వేయాలి.

పావుగంట తరువాత ఉడికితే చాలు బీట్ రూట్ ఇడ్లీ రెడీ.