ఆడవాళ్లలో రుతుక్రమానికి సంబంధించి అపోహలు ఇవిగో



పూర్వం నుంచి రుతుస్రావం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి.

పీరియడ్స్ సమయంలో నిల్వ పచ్చళ్లు, పెరుగు, పుల్లని, కారం నిండిన పదార్థాలు తినకూడదంటారు. ఇది ఒక అపోహే. మీకు పొట్ట అసౌకర్యంగా అనిపించకపోతే తినవచ్చు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది.

పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం సహజం అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు.

రుతుస్రావం సమయంలో కలిగే నొప్పికి వైద్య పరిభాషలో ‘డిస్మెనోరియా’అంటారు. తరచుగా నొప్పి వస్తుంటే దాన్ని తేలికగా తీసుకోవద్దు.

పీరియడ్స్ సమయంలో శారీరకంగా కష్టపడకూడదంటారు. నిజానికి అంత అవసరం లేదు.

మీకు నొప్పి, అసౌకర్యంగా లేకపోతే చాలు ఇంట్లో పనులు చేసుకోవచ్చు.

ఆ సమయంలో సెక్స్ కు దూరంగా ఉండాలా? అవసరం లేదు.

మీకు ఇబ్బంది లేకపోతే లైంగిక చర్యలో పాల్గొనవచ్చు.