మేషం వ్యాపార పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ ఆసక్తికి అనుగుణంగా పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరినీ విమర్శించకండి.ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.
వృషభం కార్యాలయంలో కొన్ని అవసరమైన మార్పులు చేయవలసి రావచ్చు. న్యాయపరమైన విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. రోజంతా సానుకూలంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఉద్యోగులు తమ గౌరవాన్ని కోల్పోకుండా చూసుకోండి.
మిథునం ఆఫీసు, ఇంటి బాధ్యతలను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారు. కార్యాలయంలో పనులు సులువుగా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు డబ్బు ఖర్చు అవుతుంది. విద్యార్థులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
కర్కాటకం తలపట్టిన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీరు చేసే పనులకు జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది.
సింహం దంపతుల మధ్య కొంత మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల చదువు విషయంలో కొంత ఆందోళన ఉంటుంది.ప్రజలు మీ సలహాకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.
కన్యా విమర్శలను పట్టించుకోవద్దు. ఆదాయం కొంత తగ్గుతుంది. ప్రయాణాల్లో ఆంటకాలు ఉండొచ్చు. మీ పని తీరులో మార్పు వస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో విబేధాల వాతావరణం ఉండొచ్చు.
తుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ లక్ష్యాలను సమయానికి ముందే పూర్తి చేస్తారు. వివాహ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. షుగర్, బీపీ పేషెంట్లు మందులు వేసుకోవడంలో అశ్రద్ధ చేయకండి.
వృశ్చికం ఆఫీసులో పరస్పర సామరస్యం లోపిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సమయపాలన లేకపోవడం పనులు ఆగిపోతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
ధనుస్సు నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. గత పెట్టుబడుల నుంచి లాభాలుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళా సహోద్యోగుల మద్దతు పొందుతారు. ఈ రోజు చాలా బిజీగా ఉంటారు.అనుకోకుండా డబ్బు చేతికందే అవకాశం ఉంది.
మకరం స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తెలియని వ్యక్తులు మీ పనికి ఆటంకం కలిగిస్తారు. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ఎక్కువగా ఆలోచించకండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
కుంభం ప్రేమికులకు మంచి రోజు . స్నేహితుడిని కలుస్తారు. టెన్షన్ తగ్గుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది.
మీనం అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు రోజు చాలా మంచిది. మీరు పెండింగ్‌లో ఉన్న చెల్లింపును తిరిగి పొందవచ్చు.