శృతి హాసన్ ఇప్పుడు మళ్లీ సినిమాలు, వెబ్ సీరిస్‌లతో బిజీగా ఉంది. శృతి హాసన్.. మొదట్లో కమల్ హాసన్ కూతురిగా మాత్రమే అందరికీ పరిచయం. ఒక హీరో కూతురు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడమంటే మాటలు కాదు. కానీ, శృతిహాసన్ తన శ్రమ, ప్రతిభతో హీరోయిన్‌గా స్థిరపడింది. శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు, మంచి సింగర్, డ్యాన్సర్ కూడా. ఆమెకున్న టాలెంట్స్ మన హీరోలకు కూడా ఉండవేమో. తన కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా.. శృతి ఏ రోజు వెనకడుగు వేయలేదు. శృతి ఇప్పుడు బాలయ్యతో NBK 107వ చిత్రంలో నటిస్తోంది. శృతి తాజాగా ఓ ఫొటో షూట్‌లో గులాబీ పువ్వు పట్టుకుని పోజులిచ్చింది. ఏమైందో ఏమో అకస్మాత్తుగా తన చేతిలో గులాబీని నోట్లో పెట్టుకుని నమిలేసింది. అయితే, శృతి ఇదంతా ఫన్ కోసమే చేసింది. కాబట్టి, నో ట్రోలింగ్స్! Images and Videos Credit: Shruti Haasan/Instagram