జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అంటారు.
శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి
జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది.
శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది.
జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని 'మంగుశని' అంటారు.
రెండోసారి వచ్చే ఏల్నాటి శనిని 'పొంగుశని' అని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది.
మూడోసారి వచ్చిన శనిని 'మృత్యుశని' అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయం తప్పవు. ప్రాణం పోయేంతవరకూ పరిస్థితులు వెళతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక 12,1,2 స్థానాల్లో శనిసంచారాన్ని ఏలినాటి శని అంటే... జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.