శనిత్రయోదశి, శని అమావాస్య రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు



మే 28 శనివారం శనిత్రయోదశి, మే 30 సోమవారం శనిఅమావాస్య (శని జయంతి). ఈ రెండు రోజులూ చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో మీరు పూజ, పునస్కారం చేయకపోయినా పర్వాలేదు కానీ కొన్ని పనులు మాత్రం చేయొద్దు….అవేంటంటే…



సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి...ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్టా దేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది.



అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రమే..అందుకే తలస్నానం చేయాలి. తలంటుకోరాదు



ఎట్టిపరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు, మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు



అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం



అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలితే..ఇంట్లో శుభఫలితాలుంటాయి. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వొచ్చు



అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టుకత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు. అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు



అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది



శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు, కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు



అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం, లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం