షారుక్ ఖాన్ ‘డంకీ’ ఆశించిన స్థాయిలో కాకపోయినా మంచి వసూళ్లను సాధిస్తుంది.

కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్లు బాగున్నాయి.

యూఎస్ మార్కెట్లో ఐదు మిలియన్ డాలర్ల మార్కును ‘డంకీ’ దాటింది.

ఈ విషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు.

‘పఠాన్’, ‘జవాన్’ , ‘డంకీ’లతో షారుక్ ఈ సంవత్సరం ఓవర్సీస్‌లో వసూళ్ల వర్షం కురిపించాడు.

ఈ కలెక్షన్లతో షారుక్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.

ఒకే సంవత్సరం ఓవర్సీస్‌లో ఐదు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి భారతీయ నటుడిగా షారుక్ నిలిచాడు.

‘పఠాన్’, ‘జవాన్’ అయితే ఏకంగా 15 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటాయి.

ఈ సినిమాలో షారుక్‌తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ, విక్కీ కౌశల్ కూడా నటించారు.

డిసెంబర్ 21న విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ కూడా లభించింది.