అధిక వడ్డీ అందించే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్ ఇదే SBI చెల్లించే వడ్డీ రేటు సంప్రదాయ పథకాల కంటే భిన్నంగా సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వివిధ టెన్యూర్స్ కోసం చాలా రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ఆఫర్ చేస్తోంది. ఇది ఒక నాన్-కాలబుల్ డిపాజిట్ స్కీమ్. అంటే మెచ్యూరిటీ గడువుకు ముందే ఈ అకౌంట్‌ను బ్రేక్ చేయడం, డబ్బును విత్ డ్రా చేయలేం ఎస్‌బీఐ సర్వోత్తమ్ స్కీమ్‌లో కనిష్టంగా రూ. 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలి. గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల లోపున్న డిపాజిట్లపై ఏడాదికి 7.10 శాతం వడ్డీ రేటు, రెండేళ్లకు 7.40 శాతం వడ్డీ 60 ఏళ్లు దాటిన వారికి డిపాజిట్లపై ఏడాదికి 7.60 శాతం వడ్డీ రేటు, రెండేళ్లకు 7.90 శాతం వడ్డీ రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఏడాదికి 7.05 శాతం వడ్డీ, రెండేళ్లకు 6.90 శాతం వడ్డీ రేటు రూ.2 కోట్లు దాటిన డిపాజిట్లపై 60 ఏళ్లు దాటిన వారికి 7.55 శాతం వడ్డీ, రెండేళ్లకు 7.40 శాతం వడ్డీ వస్తుంది SBI సర్వోత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇండివిడ్యువల్స్, నాన్- ఇండివిడ్యువల్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మైనర్లు, NRIలు అనర్హులు.