మీ క్రెడిట్ రిపోర్ట్ కూడా తరచూ చెక్ చేయాలి. పేటీఎం, గూగుల్‌పే వంటివి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు అందించే బెనిఫిట్స్ ప్యాకేజీల ద్వారా మీ డబ్బు, పెట్టుబడులు పెంచుకోవచ్చు. అనవసరమైన సబ్‌స్క్రిప్షన్లు ఆపేయండి. ఆటో-డెబిట్ ద్వారా, ఆ ఫ్లాట్‌ఫామ్స్ నెలనెలా మీ డబ్బును హారతి కర్పూరంలా కరిగించేస్తుంటాయి. క్యాష్-బ్యాక్ క్రెడిట్ కార్డ్ వాడండి, డెబిట్ కార్డ్ వద్దు చాలా క్రెడిట్ కార్డ్‌లు దగ్గర పెట్టుకుని బిల్లులు కట్టలేక అవస్థలు పడొద్దు. రీఫైనాన్స్ చేయడమే ఒకే అప్పుగా మార్చడమో చేయండి ఇన్యూరెసన్స్‌ని ఏటా పునఃసమీక్షించి, తగిన మార్పులు చేసుకోండి కొత్త ఇల్లు కొనాలని భావిస్తే మీ కొనుగోలు శక్తి తెలుసుకొని, EMIలు సెట్ చేయడం, మిగిలిన డబ్బుతో ఇంటిని నడపడానికి ప్లాన్ చేయండి. మీ ఫైనాన్షియల్ ప్లాన్ క్రమంగా నెరవేరాలంటే, ముందుగా ఆ అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు మీకు తెలిసి ఉండాలి. మీ స్థోమతకు మించి కాదు, తగ్గి జీవించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. సంపద పెరగాలంటే, మీ రిటైర్మెంట్ అవసరాలకు సరిపోయే పెట్టుబడులు ఎంచుకోవడం కీలకం. మీ ఆర్థిక లక్ష్యాల గురించి మీ భాగస్వామితో చర్చించండి. దాని ఆధారంగా మీ ఇద్దరి జీవితాలు, ప్రాధాన్యతల్లో మార్పులు చేసుకోండి. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ఇంటి బడ్జెట్ మారిపోతోంది. ఆ ఖర్చులకు తగ్గట్లుగా ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ ఉండాలి 2024లో రెపో రేట్ తగ్గుతుందని మార్కెట్ భావిస్తోంది. దీనికి తగ్గట్లుగానే లోన్ &డిపాజిట్ రేట్లు తగ్గుతాయి. దీనికి తగ్గట్లుగా ప్లాన్స్ ఉండాలి పొదుపు, పెట్టుబడులతోపాటు ఊహించని ఖర్చుల కోసం డబ్బు కేటాయించాలి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఆర్థిక లక్ష్యాల దూరం పెరుగుతుంది.