శని తిరోగమనం , ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే!



ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిగ్రహం జూన్ 5నుంచి నెమ్మదిగా వ్యతిరేకదిశలో కదులుతూ జూలై 12న మకరరాశికి వస్తుంది. అక్టోబరు 23 వరకూ శని వక్రంలోనే ఉంటాడు.



శని అంటే చెడు మాత్రమే చేస్తాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే శని వక్రదిశలో ఉన్నప్పుడు కూడా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలుంటాయి. ఆ రాశులేంటంటే...



మేషం (Aries)
కుంభరాశిలో శని వక్రదిశలో ఉండడం వల్ల మేష రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.



కన్య (Virgo)
శని తిరోగమనం కన్యా రాశి వారికి కలిసొస్తుంది. ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభసమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.



తుల (Libra)
ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు మాత్రం చదువుకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.



ధనుస్సు (Sagittarius)
ఈ రాశి వారని వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి, వ్యాపారం విస్తరించాలి అనుకునేవారికి అక్టోబరు 23 వరకూ మంచి సమయం. ఆర్థిక లావాదేవీలు కూడా కలిసొస్తాయి.



కుంభం (Aquarius)
కుంభరాశిలో శనితిరోగమనం వల్ల ఈ రాశివారికి ధైర్యం పెరుగుతుంది. ఎంతటి కష్టాన్ని, సమస్యను అయినా అవలీలగా ఎదుర్కొంటారు. కెరీర్ జోరందుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.



ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి