కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. సంకేత్ మహాదేవ్ సర్గార్ రజత పతకం ముద్దాడాడు. 55 కిలోల విభాగంలో 248 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 114 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు ఎత్తాడు. ఆఖరి వరకు స్వర్ణం కోసం శ్రమించినా అనిక్ కస్‌దాన్ కేవలం ఒక కిలో మాత్రమే ఎక్కువ ఎత్తి పసిడి పట్టేశాడు. రెండో ప్రయత్నంలో సర్గార్ మోచేతికి గాయం కావడంతో పసిడి పట్టలేకపోయాడు. పురుషుల 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో పి.గురురాజా కాంస్యం సాధించాడు. హోరాహోరీగా జరిగిన పోటీలో 269 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 118, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌లో గురురాజాకు వరుసగా ఇది రెండో పతకం కావడం గమనార్హం. ఆఖరి వరకు 2 స్థానంలోనే ఉన్నా క్లీన్ విభాగంలో ఒకసారి విఫలమవ్వడం రజతం పోగొట్టుకున్నాడు.