శాంసంగ్ మనదేశంలో రెండు కొత్త ఏ-సిరీస్ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అవే శాంసంగ్ గెలాక్సీ ఏ23, ఏ13 స్మార్ట్ ఫోన్లు.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలుపుతున్న దాని ప్రకారం ఈ రెండు ఫోన్లు త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ23 ఇండియన్ వేరియంట్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని సమాచారం.

ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ13లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎక్సినోస్ 850 ప్రాసెసర్ అందించనున్నారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.