ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) ఓ ఇంటివాడు అయ్యాడు! తన ప్రేయసి, భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌ను (Vini raman) పెళ్లాడాడు. మార్చి 18, శుక్రవారం నాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. 2020, మార్చి 14న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అంతకన్నా ముందు నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్లి వివరాలను మాక్సీ, వినీ మొదట బయటకు వెల్లడించలేదు. ఇద్దరూ ఒకే చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 'మిస్టర్ అండ్ మిసెస్ మాక్స్‌వెల్' అంటూ వినీ మాత్రమే కామెంట్ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మాక్సీ సన్నిహితులు, ఫ్యాన్స్ మ్యారేజ్ విషెస్ చెప్పారు. వీరి వివాహం హిందూ పద్ధతిలో నూ జరిగింది ఆ చిత్రాలను ఇప్పుడు పబ్లిష్ చేశారు.