మేషం: ఈరోజంతా మీరు గందరగోళంగా ఉంటారు. అపరిచితులను నమ్మొద్దు. నిత్యం మీరు చేసే పనిలో స్వల్పమార్పులు ఉంటాయి. విద్యార్థులకు శుభసమయం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.
వృషభం: వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. ఎక్కువ పని ఒత్తిడి తీసుకోకండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమికులకు ఈ రోజు మంచిది...పెళ్లి దిశగా అడుగేయాలి అనుకునేవారికి అనుకూలసమయం.స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
మిథునం: ఈ రోజు మీకు అంత మంచిగా లేదు.నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారి ప్రయత్నాలు సక్సెస్ కావు. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కర్కాటకం: ఇంటా-బయటా వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. బంధువులను కలుస్తారు. మీ దినచర్యను ఫాలో అయిపోయిండి. పిల్లల పని మీద ఓ కన్నేసి ఉంచండి.ఎవరి సలహాలు తీసుకోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి.
సింహం: ఈరోజు మీకు అంతగా కలసిరాదు.మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించవద్దు.అనారోగ్య సూచనలున్నాయి.
కన్య: ఈరోజు మీకు కలిసొస్తుంది. ఆశించిన ఫలితాలు సాధించడంతో ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు.అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. దూరప్రాంత ప్రయాణాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
తుల: ఈరోజు మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీకు లాభిస్తాయి.
వృశ్చికం: స్నేహితులను కలుస్తారు. దాంపత్య జీవితం బావుంటుంది. వ్యాపారులు చాలా బిజీగా ఉంటారు. మీరు చేసే సహాయం ఎవ్వరికీ చెప్పకండి. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి.మీ పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహించకండి.
ధనస్సు: ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కోకతప్పదు. అనుకోని అతిథులు ఇంటికి రావడంతో కొంత ఇబ్బంది పడతారు.ప్రభుత్వ పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు.అప్పులు ఇవ్వొద్దు.
మకరం : ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. మీ దినచర్య క్రమశిక్షణతో ఉంటుంది. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు.
కుంభం: విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా స్పెండ్ చేస్తారు. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి.
మీనం: ఆర్థికంగా ఇబ్బంది పడతారు.పని ప్రదేశంలో ఒత్తిడి ఉంటుంది. అతి విశ్వాసంతో పెద్ద నిర్ణయాలేవీ తీసుకోకండి.బంధువులను కలుస్తారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.