ఎప్పుడు? ఎలా? ఏమిటి? 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి రాజమౌళి ఏం చెప్పారు? ఏ తేదీన ఏం జరిగింది? ఆసక్తికరమైన విశేషాలు...
ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో దిగిన ఫొటోను నవంబర్ 18, 2017న రాజమౌళి ట్వీట్ చేశారు. సినిమా చేయవచ్చని అప్పుడే అనుకున్నారంతా!
ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నట్టు సినిమా చేస్తున్నట్టు మార్చి 22, 2018న రాజమౌళి ప్రకటించారు.
పూజా కార్యక్రమాలతో నవంబర్ 19, 2018న సినిమా ప్రారంభమైంది.
అదే ఏడాది నవంబర్ 19న షూటింగ్ ప్రారంభించారు.
కొమురం భీమ్, అల్లూరి కలిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ కథతో సినిమా చేస్తున్నట్టు మార్చి 14, 2019న విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
మార్చి 18, 2019న 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ టైటిల్ ప్రకటించారు. తర్వాత అదే టైటిల్ ఖరారు చేశారు.
మార్చి 25, 2020లో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామరాజు ఇంట్రో వీడియో 'భీమ్ ఫర్ రామరాజు' విడుదల చేశారు.
కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసిన తర్వాత... అక్టోబర్ 6, 2022లో పునః ప్రారంభించారు.
ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ... అక్టోబర్ 22, 2020న భీమ్ ఇంట్రో వీడియో - రామరాజు ఫర్ భీమ్ విడుదల చేశారు.
జూలై 15, 2021న 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' విడుదల చేశారు.
'దోస్తీ...' పాటను ఆగస్టు 1, 2021న విడుదల చేశారు.
'నాటు నాటు...' పాటను నవంబర్ 10, 2021న విడుదల చేశారు.
'జనని...' పాటను నవంబర్ 26, 2021న విడుదల చేసింది.
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ డిసెంబర్ 10, 2021న విడుదల చేశారు.
'కొమురం భీముడో...' పాటను డిసెంబర్ 24, 2021న విడుదల చేశారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలకు ఎన్ని తేదీలు ప్రకటించారో తెలుసా? ఆరు!
తొలుత 2020 జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత 2021లో జనవరి 8, అక్టోబర్ 13 అన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల ఖాయమని ప్రచారం మొదలు పెట్టారు. కరోనా కారణంగా వాయిదా వేసి ఆ తర్వాత మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేద్దామనుకున్నారు. చివరకు, మార్చి 25న వస్తోంది.