సామజవరగమన ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను పూర్తిగా ఫన్ డైలాగ్స్‌తో నింపేశారు. ‘బాక్సాఫీస్ బాలు’ అనే పాత్రలో శ్రీవిష్ణుని చూడవచ్చు. ‘వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేజీయఫ్ బానిసలు’ లాంటి ఫన్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. మరో పాత్రధారి ‘నిబ్బీలు అంటే ఏంటి’ అని శ్రీవిష్ణుని అడుగుతాడు. అప్పుడు శ్రీవిష్ణు ‘తెలివైన అబ్బాయిలని నిబ్బాలు అని, తెలివైన అమ్మాయిలని నిబ్బీలని అంటారు.’ అని చెప్తాడు. వెంటనే ఆ పాత్రధారి ‘నా ఇద్దరు కూతుళ్లు నిబ్బీలే’ అనడం వంటి మూమెంట్స్ ఫన్ జనరేట్ చేశాయి. ‘నీదే కులంరా’ అని వెన్నెల కిషోర్ పనివాడిని అడిగినప్పుడు అతను ‘శ్రీకాకుళం’ అంటాడు. పరిచయం అయిన ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకునే శ్రీవిష్ణు అలవాటును హీరోయిన్ ఎత్తిపొడుస్తుంది. ట్రైలర్‌లో హీరోయిన్ రెబా మోనికా జాన్‌తో చిన్న గ్లామర్ టచ్ కూడా ఇచ్చారు.