జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ మొదటి రోజు రూ.223 కోట్లు సాధించింది. ఈ లిస్టులో ఇప్పటికీ ఆర్ఆర్ఆర్‌నే మొదటి స్థానంలో ఉంది. ప్రభాస్ బాహుబలి మొదటి రోజే రూ.215 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రభాస్ లేటెస్ట్ రిలీజ్ ఆదిపురుష్ కూడా రూ.140 కోట్ల వసూళ్లను మొదటి రోజే సాధించింది. మొదటి రోజు రూ.124 కోట్ల వసూళ్లతో సాహో కూడా ఈ లిస్ట్‌లో చేరింది. రాకింగ్ స్టార్ యష్ ‘కేజీయఫ్: చాప్టర్ 2’ మొదటి రోజు రూ.165 కోట్ల వసూళ్లను సాధించింది. మొదటి రోజు షారుక్ ఖాన్ ‘పఠాన్‘ ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు సాధించింది. సెప్టెంబర్‌లో విడుదల కానున్న ప్రభాస్ ‘సలార్’ ఈ క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది. అదే నెలలో విడుదల కానున్న షారుక్ ‘జవాన్’ కూడా రూ.100 కోట్ల మార్కు మొదటి రోజే దాటవచ్చు.