జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నల్లడ్రస్సులో మెరిసిపోతున్న జాన్వీని ఆ ఫొటోల్లో చూడవచ్చు. జాన్వీ కపూర్ స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ ట్రెండీగా ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివల ‘దేవర’లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించనున్నారు. ‘దేవర’లో జాన్వీ లుక్‌ను ఇప్పటికే రివీల్ చేశారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రధాన విలన్‌గా నటించనున్నారు. తమిళ, మలయాళం ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లతో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు.