ఈ ఏడాది సల్మాన్ ఖాన్ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.



వాటిలో మొదటిది ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్’.



ఈద్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.



తమిళ సినిమా ‘వీరం’కి ఇది అధికారిక రీమేక్.



‘వీరం’ సినిమాను తెలుగులో ‘కాటమ రాయుడు’ పేరుతో రీమేక్ చేశారు.



ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు.



ఇక ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా విడుదల కానుంది.



యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో ఈ సినిమా రానుంది.