13 ఏళ్లకే రూ.44 లక్షల కారు- ఈ చైల్డ్ ఆర్టిస్ట్ రేంజి మామూలుగా లేదుగా! చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన రివా అరోరా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయ్యింది. 'ఉరి', 'గుంజన్ సక్సేనా' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఈమధ్యే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'ఛత్రీవాలీ' సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మాయి యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే ఇన్‌స్టాలో 10 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా రివాకు ఓ ఖరీదైన ఆడి కారును బహుమతిగా అందించింది తల్లి. ఈ కారు ఖరీదు సుమారు రూ. 44 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టు చూసిన అభిమానులు ఆమెకు అభినందనలు చెప్తున్నారు. ప్రస్తుతం రివా కారు వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది. మరి కొందరు నెటిజన్లు లైసెన్స్ ఉందా పాపా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Photos & Videos Credit: Riva Arora/Instagram