సల్మాన్ ఖాన్ ‘బజరంగి భాయ్‌జాన్’ నేటితో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

2015లో జులై 17వ తేదీన ఈ సినిమా విడుదల అయింది.

సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇప్పటికీ హయ్యస్ట్ కలెక్టెడ్ సినిమా.

మొత్తంగా రూ.918 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా సాధించింది.

‘బాహుబలి 1’ విడుదల అయిన వారానికి ‘బజరంగి భాయ్‌జాన్’ విడుదల అయింది.

వసూళ్లు మాత్రం ‘బాహుబలి 1’ (రూ.650 కోట్లు) కంటే ఎక్కువగా సాధించింది.

బాహుబలి రచయత వి.విజయేంద్ర ప్రసాద్‌నే ఈ సినిమాకు కూడా కథ అందించడం విశేషం.

కేవలం ఓవర్సీస్‌లోనే ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

దీనికి సీక్వెల్ కూడా రాస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే ప్రకటించారు.

మరి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది.