టాలీవుడ్ అడుగుపెట్టిన బాలీవుడ్ అందాల భామ సయీ మంజ్రేకర్. ఈమె ఎవరో కాదు కొన్ని తెలుగు సినిమాలలో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు. వరుణ్ తేజ్ తో 'గని' సినిమాలో, అడివి శేష్ తో కలిసి 'మేజర్' సినిమాల్లో నటించింది. సాయి మంజ్రేకర్ బాలీవుడ్ సినిమా 'దబాంగ్ 3'తో తెరంగేట్రం చేసింది. అక్కడ్నించి టాలీవుడ్ అవకాశాలను అందుకుంది. మహేష్ మంజ్రేకర్ కు టాలీవుడ్ దర్శకనిర్మాతలతో మంచి స్నేహం ఉంది అందుకే సయీకి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సాయి మంజ్రేకర్ లేటెస్ట్ ఫొటోలు