ఉక్రేయిన్‌లో లొకేషన్లు భలే అందంగా ఉంటాయి. కానీ, యుద్ధం వల్ల ఇప్పుడు చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. యుద్ధానికి ముందు అక్కడ పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను షూట్ చేశారు. ఇప్పటివరకు ఉక్రేయిన్‌లో దక్షిణాది చిత్రాలే ఎక్కువగా షూటింగ్ జరుపుకున్నాయి. అవేంటో చూసేయండి మరి. ఉక్రేయిన్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రం ‘విన్నర్’. రకుల్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’లో ‘‘పిచ్చోడినే అయిపోయా’’ పాటను అక్కడే తెరకెక్కించారు. ‘స్పెషల్ ఓపీఎస్ 1.5’ వెబ్ సీరిస్‌లోని కొన్ని సన్నివేశాలు కూడా ఉక్రేయిన్‌లోనే చిత్రీకరించారు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR మూవీ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ అంతా ఉక్రేయిన్‌లోనే జరిగింది. రజనీకాంత్ నటించిన ‘2.0’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఉక్రేయిన్‌లోనే షూట్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ ‘99 సాంగ్స్’ చిత్రంలోని పలు సన్నివేశాలను ఉక్రేయిన్‌లో తెరకెక్కించారు. కార్తీ, రకుల్ నటించిన తెలుగు-తమిళ చిత్రం ‘దేవ్’లోని కొన్ని సీన్స్ సాంగ్స్ ఉక్రేయిన్‌లో చిత్రీకరించారు.