గుండె సమస్యలను ముందుగానే అంచనా వేయొచ్చని, కంటి పరీక్ష ద్వారా గుండె సమస్యలను గుర్తించవచ్చని చెబుతున్నారు.

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌’ ద్వారా కంటిని స్కాన్ చేసి గుండె సమస్య తెలుసుకోవచ్చు.

రెటీనా రక్త నాళాలలో అతి చిన్న మార్పు ద్వారా వాస్కులర్ వ్యాధి, గుండెపోటును గుర్తించవచ్చట.

యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌లో శిక్షణ పొందిన పరిశోధకులు AI వ్యవస్థ ద్వారా కంటి స్కాన్‌లను పరిశీలిస్తున్నారు.

ఈ కంటి పరీక్షల ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని ఏడాదికి ముందే అంచనా వేయొచ్చట.

సి-రియాక్షన్ ప్రోటీన్ (CRP) అనే మరో విధానంలో మూడేళ్లకు ముందే గుండె జబ్బులను తెలుసుకోవ్చట.

CRP అంటే గుండెపోటు సమస్య మొదలైన తర్వాత ఆ వ్యక్తి రక్తంలో కనిపించే ప్రోటీన్.

CPR ప్రోటీన్ పరీక్షతో భవిష్యత్తులో ఏర్పడే గుండె సమస్యలను తెలుసుకోవచ్చు.

CRP స్థాయిలు 10-15 mg/Lకి పెరిగినప్పుడు గుండెపోటు ముప్పు 35% ఉన్నట్లు తెలుపుతుంది.

మీ ఛాతి వద్ద అసౌకర్యంగా అనిపిస్తే.. ముందు జాగ్రత్తగా పైన పేర్కొన్న పరీక్షలు చేయించుకోండి. గుండె నొప్పి రాకుండా జాగ్రత్త పడండి.