‘బాహుబలి’ తర్వాత సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో చిత్రం.. RRR. ఈ చిత్రం గురించి జక్కన్న అండ్ టీమ్ ఎంత శ్రమించారనేది మాటల్లో చెప్పడం కష్టమే. మొదట్లో RRR షూటింగ్ పూర్తి చేయడానికి 240 రోజులు అనుకున్నారు. కానీ, మరో 60 రోజులకు పెంచారు. కోవిడ్-19 RRRకు ఊహించని షాకిచ్చింది. షూటింగ్‌తోపాటు విడుదల కూడా పలుసార్లు వాయిదా పడింది. ‘బాహుబలి’ రెండు సీరిస్‌లను 600 రోజుల్లో పూర్తిచేయగా RRRకు 300 రోజులు పట్టింది. 2018, నవంబరు 19న మొదలైన షూటింగ్, 2021-ఆగస్ట్ 26న ఉక్రేయిన్‌లో ముగిసింది. ఈ చిత్రానికి రూ.550 కోట్లు వరకు వెచ్చించినట్లు సమాచారం. మధ్యలో కోవిడ్-19 వల్ల షూటింగ్‌కు చాలాసార్లు అంతరాయం వాటిల్లింది. దాని వల్ల అదనపు భారం పడింది. RRRను హైదరాబాద్‌తోపాటు నెదర్లాండ్, బల్గేరియా, గుజరాత్, ఉక్రెయిన్‌లలో చిత్రీకరించారు. గండిపేటలో రాజమౌళి కొడుకు కార్తికేయ ఫ్రెండ్‌కు చెందిన 10 ఎకరాల స్థలంలో ఢిల్లీ సెట్ వేశారు. మొదట్లో 28 నైట్ షూట్స్ అనుకున్నారు. కానీ, జక్కన్న 60 రాత్రిళ్లు షూట్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ మొదలు కావడానికి ముందు 200 రోజులు రిహార్సల్స్ చేశారు. 9 మంది కో-డైరెక్టర్లు, 3 వేల మంది సాంకేతిక నిపుణులు RRR కోసం పనిచేశారు. Images And Videos Credit: RRR/Instagram