1. అత్యధిక సిక్సర్ల జాబితాలో నాలుగో స్థానం. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో మహేంద్ర సింగ్ ధోని (219) నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (357), ఏబీ డివిలియర్స్ (251), రోహిత్ శర్మ (227) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
2. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో ధోని ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 193 ఇన్నింగ్స్‌లో 4746 పరుగులను ధోని సాధించాడు.
3. ఈ టోర్నీలో ధోని మొత్తంగా 23 అర్థ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన వారి జాబితాలో ధోని 12వ స్థానంలో ఉన్నాడు.
4. 2012లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోని కేవలం 20 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. అప్పటికి అది ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీ.
5. ఐపీఎల్‌లో ధోని సగటు 39.55గా ఉంది.
6. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు (122) పట్టిన వికెట్ కీపర్ ధోనినే.
7. అత్యధిక స్టంపింగ్‌లు (39) కూడా ధోనివే.
8. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు (220) ఆడిన ఆటగాడు ధోనినే.
9. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ (204) వహించిన రికార్డు కూడా ధోని పేరు మీదనే ఉంది. (All Images Credit: IPL)