ఇంట్లో ఇలా గులాబీపూలు పెడితే డబ్బే డబ్బు ఇంట్లో అడుగుపెట్టగానే కొందరి ఇళ్లలో గిన్నెడు నీళ్లలో పోసిన గులాబీ రెక్కలు స్వాగతం పలుకుతాయి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందట. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి, పాజిటివ్ ఎనర్జీని పెంచితే ఆ ఇళ్లు ఆర్ధికంగా, ఆనందంగా కళకళలాడిపోతాయి. అనారోగ్యసమస్యలు, ఆర్ధిక సమస్యలను పారద్రోలే శక్తి పాజిటివ్ ఎనర్జీకి ఉంది. కేవలం ఎరుపు రంగు గులాబీ పూలనే ఇందుకు ఎంచుకోవాలి. అది కూడా గాలి తగిలే చోట పెట్టాలి. ఆ పూరేకుల మీద నుంచి వీచే గాలి ఇంట్లోకి వీస్తుంది. ఆ గాలి గులాబీల పరిమళాన్ని మోసుకెళుతుంది. ఇల్లంతా ఆ పరిమళం వ్యాప్తి చెంది నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపేస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆర్ధికంగా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.